TRINETHRAM NEWS

తాడేపల్లి

ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో త్వరలో బస్ యాత్ర

రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తూ బస్సు యాత్ర

రాష్ట్రంలో మొట్ట మొదటి సారి ప్రతిష్టాత్మకంగా ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో గొప్ప బస్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ముస్లిం ఐక్య వేదిక
రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ అన్నారు.బుధవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ముస్లిం ఐక్య వేదిక
ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జాఫర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రం విభజించబడి 10 సంవత్సరాలు కావస్తోందని ,8.50 కోట్ల ప్రజలు విభజన తరువాత పడిన బాధ వేదన మాటల్లో చెప్పలేనిదని అక్షరాల్లో వ్రాయ లేనిదని మన రాష్ట్ర అభివృద్ధి గురించి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నాయకులు పడుతున్న కష్టం ఎంతో ప్రశంసనీయమని కుల,మత రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడటం మనందరి బాధ్యత అని అన్నారు.మేము సైతం ఆంధ్ర ప్రదేశ్ – అభివృద్ధి కోసం” అంటూ బాధ్యత కలిగిన పౌరులుగా మన రాష్ట్ర ప్రజలను చైతన్య పరుస్తూ మేల్కొల్పడమే మా “బస్ యాత్ర లక్ష్యమని అన్నారు.బస్ యాత్ర లో భాగంగా, రాజ్యాంగ హక్కులు, సామజిక న్యాయం
రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాల పై ముస్లిం సమాజాన్ని చైతన్య పరుస్తూ కలిసి కట్టుగా ముందుకు నడిచే విధంగా ప్రయాణం సాగనుందని తెలిపారు.
ముస్లిం ఐక్య వేదిక అనే సామాజిక సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని అన్నారు. కరోనా లో కుల మతాలకు అతీతంగా ఎంతో మంది ఆకలి తీర్చామని వలస కార్మికులను ఆదుకున్నామని అన్నారు.చనిపోయిన వారికి సామాజిక దురాచారాలపై పోరాటం చేస్తూ సమావేశాలు సభలు నిర్వహిస్తూ ప్రజలను
చైతన్య పరుస్తున్నామని అన్నారు.పాలనా పరంగా ఎన్నో శాఖల్లో ముఖ్యంగా ఆరోగ్య, ఉపాధి, విద్యా శాఖల్లో అవినీతి లేకుండాbప్రజలకు అధికారులకు ఉన్న దూరాన్ని తొలగిస్తూ వారధి గా పని చేస్తూ గొప్ప కార్యం
చేపడుతున్నామని అన్నారు.బస్ యాత్ర ద్వారా మరింత గా ప్రజలకు చేరువ అవ్వాలని జిల్లాల లో ప్రజలను నేరుగాకలుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో భాగం అవ్వాలని ఈ గొప్ప బస్ యాత్రను
ప్రారంభిస్తామని అన్నారు.ముస్లిం మైనారిటీలు రాజకీయంగా అభివృద్ధి చెందితే సామాజికంగా మెరుగుపడుతూ, రాజ్యాంగ హక్కుల సాధన కూడా సాధ్యం అవుతుందని ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ లు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి లో భాగం కాగలరని ముస్లిం ఐక్య వేదిక బస్సు లో 14 మంది సభ్యులు, ఒక బస్సు తో పాటు రెండు కార్ల లో రాష్ట్ర పర్యటన చేయదల్చామని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నూర్ ఖాన్,
బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ మౌలా బేగ్,యూత్ అధ్యక్షులు మహమ్మద్ అన్సర్,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు
అబ్దుల్ రెహమాన్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్,
అబ్దుల్లా,ట్రెజరర్ సలావుద్దీన్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రెటరీ అహ్మద్,రాష్ట్ర కమిటీ సభ్యులు,సయ్యద్ కాజా, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు, నసీమా సుల్తానా,రాష్ట్ర కమిటీ సభ్యులు,హాజీ హుస్సేన్
రాష్ట్ర అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.