WhatsApp Image 2024 08 18 at 17.10.09
J. Aruna, Additional Collector of Local Bodies, paid tribute to Sardar Sarvai Papanna Goud
పెద్దపల్లి, ఆగస్టు -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ ఘన నివాళులు అర్పించారు.
ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ జ్యోతి పాల్గొని ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పాటుపడాలని అదనపు కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో సహయ బీసి అభివృద్ధి అధికారి ,జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎం.అంజయ్య గౌడ, గౌడ సంఘ ప్రతినిధులు బాలసాని వెంకటేశం గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
