Action should be taken against those who are making false allegations against CPM party and leaders
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏసిపి రమేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
గత రెండు సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటంలో ఇల్లు లేని నిరుపేదలు సుమారు 350 మంది ఇల్లు నిర్మించుకొని గంగానగర్ మల్లు స్వరాజ్యం కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో ఎస్టీపీ నిర్మాణం కోసం స్థల సేకరణలో భాగంగా పేదలు వేసుకున్న 123 మంది ఇండ్లను తొలగించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అమెరికా పర్యటనలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుండి బాలరాజు, మహంకాళి స్వామి గార్లను సిపిఎం నాయకత్వంతో చర్చలకు పంపించడం జరిగిందని ఈ చర్చల్లో మున్సిపల్ కమిషనర్,ఏసిపి,డిసిపి కూడా పాల్గొన్నారు అన్నారు. మల్లు స్వరాజ్యం కాలనీలోనే ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశానికి వీరంతా హాజరై బాధితులకు పక్కనే ఉన్న స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇంటి పథకం అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
అందుకు సమ్మతించి సిపిఎం పార్టీ నాయకత్వం మరియు బాధితులు అందరూ ఒప్పుకొని ఇండ్ల తొలగింపుకు సహకరించడం జరిగింది.
వాస్తవాలు ఇలా ఉంటే కొంతమంది నిజా నిజాలు తెలుసుకోకుండా స్థానిక ఎమ్మెల్యే తోని సిపిఎం పార్టీ నాయకత్వం కుమ్మక్కయ్యి ఇండ్ల తొలగింపుకు సహకరించారని, డబ్బులు తీసుకున్నారని పోస్టులు పెడుతున్నారు. సిపిఎం పార్టీకి ఎమ్మెల్యేతో గానీ, ఇతరులతో గాని కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం లేదని సిపిఎం పార్టీ ఎప్పుడైనా పేదల పక్షాన పేదలకు న్యాయం జరిగేంతవరకు నిలబడుతుందని, అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తుందని అన్నారు.
కొంత మంది పని కట్టుకొని నిజానిజాలు తెలుసుకోకుండా ఫేస్బుక్లో, వాట్సాప్ లో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లైవ్ లు పెడుతూ సిపిఎం పార్టి నాయకత్వాన్ని, అదేవిధంగా పార్టీని బదనం చేసే విధంగా కొంతమంది పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ బృందం ఏసిపి తెలియజేయడం జరిగింది. అందుకు తాను కచ్చితంగా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి,
ఎరవెల్లి ముత్యంరావు,
ఏ మహేశ్వరి,
ఎం.రామాచారి మరియు మల్లు స్వరాజ్యం కాలనీ బాధితులు కాంతి, భాస్కర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విప్లవ అభినందనలతో వేల్పుల కుమారస్వామి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App