Bharosa Naseema conducted mass literacy under Pallikonda Rajesh
రామగుండం నియోజకవర్గo పెద్దపల్లి జిల్లా
పల్లికొండ రాజేష్ అధ్వర్యంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించిన భరోసా నసీమ
విద్యా దానం మహా దానం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం భరోసా నసీమ ఔన్నత్యానికి నిదర్శనం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్
విద్యార్థుల మౌలిక వసతుల రూపకల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతున్న భరోసా నసీమ హృదయపూర్వక అభినందనలు ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వరలక్ష్మీ వ్రత పండగ సందర్భంగా రామగుండం లోని హనుమాన్ టెంపుల్ లో హౌసింగ్ బోర్డు రామగుండం పట్టణానికి చెందిన చిన్నపిల్లలకు ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ అధ్వర్యంలో భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా సహకారాలతో ఈదునూరి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి సామూహిక అక్షరాభ్యాసం పురోహితులు మారుపాక చందు సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది.
పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ
ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమ నిర్వహణ భరోసా నసీమ సహకారాలతో ఏర్పాటుచేసిన
ఈ కార్యక్రమం చాలా అభినందనీయమని ఏ పాఠశాలకు వెళ్లిన భరోసా నసీమా సేవా కార్యక్రమాలు వినబడుతున్నాయని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పల్లికొండ రాజేష్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కన్నుల పండుగగా పూజ కార్యక్రమాలు నిర్వహించిన పురోహితులు మారుపాక చందు పూజారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు భరోసా ఫౌండేషన్ వారు నిర్వహించాలని మాట్లాడడం జరిగినది.
ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు భరోసా నసీమ కనీస సౌకర్యాలు సమకూరుస్తున్నారన్న విషయం తెలుసుకొని మా ఏరియాలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందుకు సహకరించండి అని చెప్పిన వెంటనే స్పందించి ఇట్టి కార్యక్రమానికి రూపకల్పన చేపట్టిన భరోసా నసీమ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే స్పందించి సకాలంలో విచ్చేసి సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని రాబోయే రోజుల్లో భరోసా నసీమ విద్యార్థులకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు చేస్తున్న సేవలను కొనియాడుతు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన చిన్నపిల్లల కుటుంబ సభ్యులకు అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని మాట్లాడడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కునారపు ప్రేమ్,రబ్బానీ, బీసీ సెల్ అధ్యక్షులు సాదు డిష్ రమేష్, ధర్మాజీ సంపత్, బింగి రవి,సుజాత, గోడ మీది లచ్చయ్య, గున్నాల శ్రీనివాస్ బింగి సాయి వంశీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App