వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు
జమ్మూ లోని శ్రీ మాతా వైస్ట్నో దేవి ఆలయానికి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. సోమవారం వరకు 93.50 లక్షల మంది దర్శించి నట్లు అధికారులు వెల్లడించారు.
గత పదేళ్ళలో ఇదే అధికమని, 2013 లో 93.23 లక్షల మంది భక్తులు తరలి వచ్చారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇంతవరకు అత్యధికంగా 2012 లో 1,04,09,569 మంది భక్తులు దర్శించుకున్నారు.