TRINETHRAM NEWS

Trinethram News : జిల్లా ఎస్పీ తుషార్ డూడి

బాపట్ల జిల్లాలో ప్రజలు సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.

సైబర్ కేటుగాళ్ల భారిన పడకుండా మనల్ని కాపాడే ఒకే ఒక్క ఆయుధం స్ట్రాంగ్ పాస్ వర్డ్ అని పాస్వర్డ్ పట్ల ప్రజలు ఎవరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు.

ప్రధానంగా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నివాస యజమానులు చాలా జాగ్రత్తలు పాటించాలని ఇంటికి తాళం వేశామా లేదా అనేది రెండుసార్లు పరిశీలించుకోవలసిన అవసరం ఉందన్నారు.

ఆన్లైన్ లావాదేవీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు వివిధ బ్యాంకుల నుండి ఫోన్లు చేసి ఆధార్ నెంబర్లు, ఓటీపీలు అడిగితే అటువంటి వారికి సమాచారం చెప్పవద్దన్నారు.

ఎవరైనా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని సమాచారం చెప్పాలని అడిగితే నేరుగా బ్యాంక్ అధికారులు సంప్రదించి వివరాలు బ్యాంక్ అధికారులకు మాత్రమే అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచనలు చేశారు.