TRINETHRAM NEWS

Mudiraj should be changed from BC-D to BCA immediately

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య ముదిరాజ్ మరియు రామగుండం నియోజకవర్గ ఇంచార్జి, అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ ఆదేశాల మేరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, కార్పోరేటర్ సాగంటి శంకర్ ముదిరాజ్ మరియు *ప్రధాన కార్యదర్శి, 8వ కాలనీ పట్టణ అధ్యక్షులు మేడి సదయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ముదిరాజ్ కులస్తులు అన్నారు….

అలాగే ఎంఆర్వో కు వినతిపత్రం అందజేసిన ముదిరాజ్ కులస్తులు…
రామగుండం నియోజకవర్గంలోని ముదిరాజ్ కులస్తులు బిసి డి నుండి బిసి ఏ కు మార్చాలని బుధవారం రామగుండం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజులకు ఇచ్చిన హామీ మేరకు బిసి-డి నుండి బీసీ ఏ వెంటనే మార్చాలని కోరారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా గలిగిన ముదిరాజ్ కులస్తుల లో ఎంతోమంది పేద అణగారిన మత్స్యకారులుగా చేపలు పట్టుకొని అమ్మడం.. అలాగే పండ్లు టోటల్ లీజుకు తీసుకొని అమ్ముకోవడం లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ముదిరాజులు జీవిస్తున్నారని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చోరవతీసుకొని బీసీడీ నుంచి బీసీ ఏ కు మార్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పిడుగు కృష్ణ ముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, గైక్వాడ్ రజిని కాంత్ ముదిరాజ్, దండు రవీందర్ ముదిరాజ్, మబ్బు కిష్టయ్య ముదిరాజ్, ముక్కెర మొగిలి ముదిరాజ్,అనవేన భాస్కర్ ముదిరాజ్, కలవేన మల్లేష్ ముదిరాజ్,సిద్ద సమ్మయ్య ముదిరాజ్, నెల్లి రాజేందర్ ముదిరాజ్, బోయిని సుధాకర్ ముదిరాజ్, కనుకుంట్ల సతీష్ కుమార్ ముదిరాజ్, కేశవేణి బిక్షపతి ముదిరాజ్, బోయిని కుమార్ ముదిరాజ్, గుర్రం సురేష్ ముదిరాజ్, గట్టయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App