Singareni Colliery Contract Workers Union (IFTU) demand that MLAs should discuss in the Legislative Assembly
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెరుగుదల గూర్చి చట్టబద్ధ హక్కులు అమలు గూర్చి కోల్ బెల్ట్
ఎమ్మెల్యేలు శాసనసభలో చర్చించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు )డిమాండ్.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యూ )రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి ఈసం పల్లి రాజేందర్. .
ఐ ఎఫ్ టి యూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఈదునూరి రామకృష్ణ.
సంబోజి రాజేంద్ర ప్రసాద్
ఆర్ జి వన్ కార్యదర్శి
ఈరోజు ఆర్ జీవన్ డివిజన్లోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనులు చేస్తున్నారు వీరికి కోల్ ఇండియా వేతనాలు కానీ చట్టబద్ధ హక్కులు కానీ వీరికి నేటికీ అమలు కావటం లేదు ఇట్టి అంశాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి కార్మికులను మోసం చేయడమే కాక సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని నిండు శాసనసభలో బాధ్యతగల ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినప్పుడు నోరు విప్పని కోల్బెల్టు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాని ఫలితంగా నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రత్యేకంగా కాంట్రాక్టు కార్మికులకు కలిసినప్పుడు హామీలు ఇచ్చారు కానీ నేటికీ వీరి సమస్యను పరిష్కారానికి మార్గం చేయలేదు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంతో నాలుగు తపాలా సమీక్ష సమావేశం చేసినప్పటికీ ఈ కార్మికుల యొక్క వేతనాల చట్టబద్ధ హక్కుల అమలుకై చర్చించిన పాపాన పోలేదు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పటికైనా ఈ శాసనసభ వేదికగా ఈ కార్మికుల సమస్యలను మాట్లాడి పరిష్కరించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను మంత్రులను కోరడం జరుగుతున్నది అలా జరగకపోతే భవిష్యత్తులో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులను ఐక్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతామని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో లింగయ్య. అంజయ్య. మల్లేష్ రాజు. లక్ష్మి. సువర్ణ. స్వాతి. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App