TRINETHRAM NEWS

Duties should be performed strictly Additional Collector GV Shyam Prasad Lal

రామగుండం , జూలై-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మండలంలో రెవెన్యూ అధికారులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ రామగుండం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు.

మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది విధులు, కార్యాలయాల రికార్డులు, పెండింగ్ ధరణి దరఖాస్తులు, ప్రజావాణి, సీఎంఓ కార్యాలయ దరఖాస్తులు, మెసేజ్ ల ద్వారా జారీ చేసే వివిధ సర్టిఫికెట్లు మొదలగు అంశాల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
ప్రతిరోజు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలతో మమేకం కావాలని వారి సమస్యలను ఓపికతో వినాలని అన్నారు. ప్రజా సమస్యలను సత్యం వేరే పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు.

మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, జీఎల్ఎం, డేటా కరెక్షన్, టిఎం 33 మొదలగు దరఖాస్తుల పరిష్కారానికి అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ప్రజావాణి కార్యక్రమం సీఎం కార్యాలయం నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి సదరు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యాలయ సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని తగు సూచనలు చేశారు.

మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో రామగుండం మండల తహసిల్దార్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Duties should be performed strictly Additional Collector GV Shyam Prasad Lal