WhatsApp Image 2024 07 17 at 11.45.31
CM Relief Fund is like a boon for the poor – Former MLA Kuna Srisailam Goud
Trinethram News : అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ముఖ్యమంత్రి సహాయనిధి LOC మంజూరు పత్రాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..
నిరుపేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిది – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, శ్రీరామ్ నగర్ కు చెందిన ఆశ యాలిగర్ అనే మహిళకు మెదడులో రక్తం గట్టడంతో, శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించగా, ఆమె భర్త అశోక్ యాలిగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని ఆశ్రయించగా, మాజీ ఎమ్మెల్యే తక్షణమే స్పందించి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేలు ) CMRF – LOC మంజూరు చేయించారు. సదరు భాదిత కుటుంబానికి మంజూరైన CMRF – LOC పత్రాలను ఈరోజు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు. ఈ సందర్బంగా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆపద సమయంలో స్పందించి సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
