Huge Plaza : త్వరలో హైదరాబాద్‌లో భారీ ప్లాజా బిల్లింగ్

TRINETHRAM NEWS

A huge plaza build in Hyderabad soon

Trinethram News : హైదరాబాద్‌ : జులై 12
హైదరాబాద్ రాయదుర్గం లోని నాలెడ్జ్‌ సిటీ సమీపం లో భారీ ప్లాజా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టి స్క్వేర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

ఈమేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబా టులో ఉండటంతో పాటు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టి స్క్వేర్‌ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు.

రోజువారి పనులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి టి స్క్వేర్‌లో జరిగే ఈవెంట్ల తో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని భావిస్తు న్నారు.

టీస్క్వేర్ నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది. ఇప్పటివరకూ పలువురి సెలబ్రిటీల బర్త్ డేలు, మూవీ అప్డేట్స్‌ను టైమ్ స్క్వేర్‌‌లో ప్రదర్శించే వాళ్లు. ఇప్పుడు హైదరాబా దులో నిర్మించబోతున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A huge plaza build in Hyderabad soon

You cannot copy content of this page

Scroll to Top