TRINETHRAM NEWS

The founder of Bharatiya Jan Sangh was nationalist Dr. Shyamaprasad Mukherjee

వర్ధంతి (జూన్ 23) నుండి జయంతి (జులై 6) వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక చెట్టు నాటే కార్యక్రమం ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరిఖని యన్ టి ఆర్ నగర్ లో బీజేపీ నాయకురాలు మాతంగి రేణుక ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది ఈసందర్బంగా నాయకులు మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ 1953లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించారని జమ్మూకాశ్మీర్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 370 ఆర్టికల్ ప్రవేశపెడితే తీవ్రంగా వ్యతిరేకించరని అందులో భాగంగానే శ్యామప్రసాద్ ముఖర్జీ హత్య చేయబడ్డాడని ఇప్పటికి వారి హత్య మిస్టరీగానే ఉండి పోయిందని తెలిపారు వారి ఆశయాలను ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోదీ కొనసాగిస్తున్నారని అందులో భాగంగానే జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ స్వయం ప్రతిపత్తిని ఎత్తి వేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్,కొమ్మ శ్రీనివాస్ బీజేపీ మాజీ మండల అధ్యక్షులు మామిడి సంపత్,అడ్డురి రాజేష్,మంద శ్రీనివాస్,నాయకులు కుమ్మరి మల్లేష్,వడ్లూరి రాము, పుల్లూరి వెంకటేశ్వరరావు, గాజే రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The founder of Bharatiya Jan Sangh was nationalist Dr. Shyamaprasad Mukherjee