TRINETHRAM NEWS

Important Update for Group 1 Candidates

Trinethram News : హైదరాబాద్‌ :జులై 04
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయా లని అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలుపు కోవాలని అభ్యర్ధులు కోరుతున్నారు.

అయితే ప్రభుత్వం ఏమా త్రం వీరి విన్నపాలను పట్టిం చుకోవడం లేదు. మెయిన్స్‌ కు జీవో (నం.55, 29)లలో ని నిబంధనల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తా మని టీజీపీ ఎస్సీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థు ల్ని 1:50 నిష్పత్తి లోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.

మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్థు ల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగు ణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్‌ 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడం సాధ్యం కాదని చేతులెత్తేసింది.

ఈ మేరకు అభ్యర్థుల అభ్య ర్థనలను తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ మెమో జారీచే సింది.మరోవైపు ప్రభుత్వం స్పందించకపోతే రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తామని ఉద్యోగాల కోసం నిరుద్యో గులు హెచ్చరించారు.

దీనిలో భాగంగా రేపు (శుక్ర వారం)టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువని అల్టిమేటం జారీ చేశారు. ఆలోపు ప్రభుత్వం దిగిరాకుంటే నిరుద్యోగుల ధర్నా తప్ప దని హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలతోపాటు గ్రూప్‌ 2, 3, డీఎస్సీలో పోస్టుల పెంపు వంటి చిలకపలుకులు పలికి, తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలన్నీ ఏమయ్యా యంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Important Update for Group 1 Candidates