TRINETHRAM NEWS

AICTE Ranks : ఏఐసీటీఈ ర్యాంకులు విడుద‌ల..టాప్ లో తెలంగాణ‌..పూణె

న్యూఢిల్లీ – అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి (ఏఐసీటీఈ) తాజాగా భార‌త దేశ వ్యాప్తంగా నైపుణ్య నివేదిక‌ను రిలీజ్ చేసింది. అత్య‌ధికంగా జాబ్స్ నైపుణ్యాల‌ను క‌లిగిన 5 రాష్ట్రాల‌ను ప్ర‌క‌టించింది ఏఐసీటీఈ. ఇందులో టాప్ గా తెలంగాణ నిల‌వ‌డం విశేషం. 2వ స్థానంలో కేర‌ళ‌, 3వ స్థానంలో మ‌హారాష్ట్ర‌, 4వ ప్లేస్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్, 5వ స్థానంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ నిలిచింద‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా అత్య‌ధికంగా ఉద్యోగ నైపుణ్యాల‌ను క‌లిగిన రాష్ట్రాల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో 5 స్టేట్స్ ఉన్నాయి. నెంబ‌ర్ వ‌న్ గా మ‌రాఠా లోని పూణే నిలిచింది. 2వ స్థానంలో బెంగ‌ళూరు, 3వ ప్లేస్ లో తిరువ‌నంత‌పురం, 4వ స్థానంలో ఎర్నాకులం, 5వ స్థానంలో యూపీకి చెందిన ల‌క్నో చోటు సంపాదించుకున్నాయ‌ని ఏఐసీటీఈ స్ప‌ష్టం చేసింది.

వ‌య‌సుకు అతీతంగా నైపుణ్యం ఉన్న యువ‌త క‌లిగి ఉన్న టాప్ రాష్ట్రాల‌లో 5 నిలిచాయి. టాప్ లో హ‌రియాణా చేరుకోగా , 2వ స్థానంలో మ‌హారాష్ట్ర‌, 3వ ప్లేస్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ , 4వ స్థానంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ , 5వ ప్లేస్ లో కేర‌ళ నిలిచిందని పేర్కొంది.

మ‌రో వైపు ఇంగ్లీష్ భాష‌లో నైపుణ్యం క‌లిగిన యువ‌త ఉన్న 5 రాష్ట్రాల‌లో నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా క‌ర్ణాట‌క ఉండ‌గా , 2వ స్థానంలో యూపీ, 3వ స్థానంలో తెలంగాణ‌, 4వ స్థానంలో మ‌రాఠా, 5వ ప్లేస్ లో ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రాలు కొలువు తీరాయ‌ని ఏఐసీటీఈ తెలిపింది.