A strong united struggle should be built in Singareni
బేశజాలు వీడి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి పైకి రావాలి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని తిలక్ నగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది
ఈ సమావేశంలో IFTU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ పాల్గొని మాట్లాడుతూ
ఈ మధ్యకాలంలో సింగరేణిలో కార్మిక
సంఘాలు విడివిడిగా పోరాటాలు చేయడం మూలంగా యాజమాన్యానికి కొంత లాభం కలుగుతున్న పరిస్థితి కార్మికవర్గం ఐక్యం కాలేని పరిస్థితి నెలకొంటున్నది సింగరేణిలో ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి కార్మిక సంఘాల మధ్య అనైక్యత, సింగరేణిలో రాజకీయ జోక్యం అధికంగా పెరిగిపోవడం, కార్మిక సంఘాలన్నీ ఒక్క తాటి పైకి వచ్చి యాజమాన్యానికి తమ శక్తిని చూపించకపోవడం మూలంగా పోరాడి సాధించుకున్న హక్కులను సైతం కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది.
గుర్తింపు సంఘం పేరుతో, ప్రాతినిత్య సంఘాల పేరుతో, రిజిస్టర్ కార్మిక సంఘాల పేరుతో, విప్లవ కార్మిక సంఘాల పేరుతో పోరాటాలు నిర్వహిస్తూ కార్మికులను మాత్రం ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ఐక్య కూటమి సింగరేణిలో లేకపోవడం కార్మిక వర్గానికి నష్టం. ఒకప్పుడు సింగరేణిలో ఐఎఫ్టియు పాత్ర కీలకంగా ఉన్న విషయం ఎవరికీ విధితమే కాలక్రమేనా అనేక ఒడిదుడుకులకు గురై, అనేక చీలికలకు గురై బలమైన కార్మికోద్యమాలను నిర్మించకపోవడం మూలంగా సింగరేణిలో కార్మిక వర్గ హక్కులు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది చీలికలకు గురి కావడం మూలంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం మాదంటే మాదని చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది కొంతమంది కొన్ని సంఘాలను కొంతమంది వ్యక్తుల నుంచి తీసుకొని దాని పేరు మార్చి గత పోరాటాలను ఆ సంఘాలకు తగిలించుకొని మాది రిజిస్టర్ కార్మిక సంఘం అంటూ చెప్పుకుంటున్న దుస్థితి కూడా ఉన్నది.
ఏది ఏమైనా సింగరేణిలో చిన్న,పెద్ద కార్మిక సంఘాలన్నీ బేశజాలకు పోకుండా అధికారం ఆశలకు పోకుండా కార్మిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా, బొగ్గు బావుల రక్షణే ప్రధమంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సింగరేణిలో ఐక్య పోరాటాల అవసరం ఎంతైనా ఉందని మేము గతం నుంచి నేటిదాకా చెప్తూనే ఉన్నాం. మేము దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాం.
రిజిస్టర్ అన్ రిజిస్టర్డ్ కార్మిక సంఘాల అనే తేడా లేకుండా కలిసివచ్చే కార్మిక సంఘాల అన్నింటితో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కలిసి రావడానికి మేము సిద్ధమేనని తెలియజేస్తున్నాం. ఐక్య పోరాటాల ఆవశ్యకత మాటలతో కాకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మిక సంఘాన్ని ఐక్యవేదికలో కలుపుకునే విధంగా వ్యవహరించాలని అన్ని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల అంతా కూడా ఐక్య పోరాటాలకు మరోమారు సిద్ధం కావాలని సింగరేణి రక్షణకై సమర శీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి దాముక లచ్చయ్య,
ఈ ముత్తయ్య బుష్పాక రామచందర్ , రవీందర్ , ఎల్లయ్య భీమయ్య ఎండి కాసిం తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App