WhatsApp Image 2024 06 22 at 1.02.19 PM
Another brutal murder in Hyderabad today
Trinethram News : హైదరాబాద్ : జూన్ 22
హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. సెంటెన్స్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి కు తరలించారు పోలీసులు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా పాతబస్తీలో వరుస హత్య లు…భయాందోళన రేపుతున్నాయి.
రెండు రోజుల వ్యవధిలో 6 హత్యలు, 2 హత్యా యత్నా లు చోటు చేసుకున్నాయి. ఇవాళ మెహదీపట్నంలో మరో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో దారుణం జరిగింది.
ఇంట్లోకి చొరబడి మొహ మ్మద్ జాకీర్ హుస్సేన్ కు హత్య చేశారు దుండగులు. అక్రమ సంబంధం కారణం గానే జాకీర్ ను హత్య చేసినట్లుపోలీసులు గుర్తించారు.షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్ మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
