Singareni Company should not participate in auction of Singareni Coal Blocks by State Govt.
సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్!
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యాలయంలో ఐక్యవేదిక సమావేశము జరిగినది.
ఈ సమావేశానికి వేదిక కన్వీనర్ రియాజ్ అధ్యక్షత వహించారు.
పాల్గొన్న కార్మిక సంఘాలు
హెచ్ఎంఎస్ రియాజ్, జే నారాయణ, ఐ ఎఫ్ టి యు ఐ కృష్ణ, ఈ నరేష్, టి ఎస్ యు ఎస్ కామెర గట్టయ్య, కుమారస్వామి, ఏ ఐ ఎఫ్ టీ యు జి రాములు, ఎం రాయమల్లు, జి ఎల్ బి కే ఎస్,ఐఎఫ్టియు ఈ రామకృష్ణ, ఈ రాజేందర్, టిఎన్టిసి నిమ్మకాయల ఏడుకొండలు, దామోదర్ రెడ్డి, కోటగిరి పాపయ్య.లు పాల్గొన్నారు
తేదీ జులై 3న హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేధావులు ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
జూన్ 24 నుండి జూలై 3వ తేదీ లోపున సింగరేణిలోని కోల్ మైండ్స్ పై గేట్ మీటింగ్ నిర్వహించాలని కొత్తగూడెం, భూపాలపల్లి,శ్రీరాంపూర్, గోదావరిఖనిలో ప్రెస్ మీట్స్ నిర్వహించాలని విస్తృత ప్రచారం చేయాలని తీర్మానించడం జరిగింది.
రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మరొక తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సింగరేణిలోని కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవపరిస్థితులు మరియు సింగరేణి బ్లాకులు సింగరేణికే చెందాలని వేలంలోకి పోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు రియాజ్, ఐ కృష్ణ, కామెర ఘటయ్య, జి రాములు, రాజేందర్, ఏడుకొండలు మాట్లాడుతూ సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే చెందాలని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించినట్టుగానే మన రాష్ట్రంలో కూడా అదే విధానం పాటించాలని వేలంలోకి రాష్ట్ర ప్రభుత్వం గానీ సింగరేణి గానీ వెళ్ళకూడదని ఎవరు పాల్గొన్న కార్మికులు ప్రజలు హర్షించారని వేలం ద్వారా ఏ కంపెనీ ఈ బొగ్గు బ్లాక్లని కైవసం చేసుకున్న ఆ ప్రాంతంలో ప్రజలందరినీ కదిలించి బొగ్గు పెల్ల కూడా కార్పొరేట్ శక్తులకు చందనీయమని ఎంతటికైనా ప్రతిఘటించి సింగరేణి సంస్థను సింగరేణి భవిష్యత్తును కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App