జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 20 at 08.58.12

TRINETHRAM NEWS

Dwaraka Tirumala Rao as AP DGP

Trinethram News :

అమరావతి:జూన్ 20
ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమిస్తూ సీఎస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఏపీ,ఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వ హిస్తున్న ద్వారకా తిరుమ లరావును రాష్ట్ర పోలీస్ బాస్ గా కూటమి సర్కార్ నియమించింది.

ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

ద్వారకా తిరుమలరావు 1989వ బ్యాచుకు చెందిన ఐపీఎస్ అధికారి. గత నెలలో ఏపీల ఎన్నికల కొన్ని రోజుల ముందుగా డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.

ఆ సమయంలోనే ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే ఛాన్స్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీశ్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్ అవకాశం ఇచ్చారు.

ఎన్నికల సంఘం నిర్ణయం తో ఎన్నికల నిర్వహణ మొత్తం కూడా హరీశ్ కుమార్ గుప్తా డీజీపీగానే కొనసాగింది. ఈ మధ్యే ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరింది. ఈ క్రమం లోనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు కొనసాగుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dwaraka Tirumala Rao as AP DGP.

You cannot copy content of this page