Trinethram News : సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కేసు వివరాలు తెలియపరుస్తూ సోలంకి గైక్వాడ్ రాధ భర్త విజయ్, వయసు 27 సంవత్సరములు, భర్త పిల్లలతో కలిసి సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్ లో గత మూడు సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ ఆ ఇంటి యజమాని కొడుకు అయినా గోవిందారం కిషోర్ తండ్రి మహేష్, వయస్సు 16 సంవత్సరాల మైనర్ బాలుని తన మాయ మాటలతో లోబరుచుకుని ఆ బాలునితో బలవంతంగా శారీరకంగా కలిసేది, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ బాలునితో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉద్దేశంతో అతన్ని బలవంతంగా ఒప్పించి సదరు నిందితురాలు బాలుడి ఇంట్లో ఉన్న డబ్బులు బంగారము బాలుడితో తెప్పించుకొని తన భర్త పిల్లలను ఇక్కడనే వదిలేసి బాలున్ని తీసుకొని చెన్నై వెళ్ళింది.
ఆ బాలుని తల్లి తన కొడుకు కనిపించడం లేదని పై నిందితురాలపై అనుమానం ఉన్నదని దరఖాస్తు ఇవ్వగా సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు పరిశోధనలో భాగంగా టెక్నాలజీ ద్వారా సదరు మహిళ నిందితురాలు చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని తేదీ: జూన్11-06 రోజున ఆ బాలుని సిద్దిపేటలో వదిలివేయగా తన ఇంటికి చేరుకున్నాడు.
సదరు బాలుడిని తన తల్లి పోలీస్ స్టేషన్కు తీసుకుని రాగా బాలుని ఏమి జరిగిందని విచారించగా చెన్నైలో ఒక రూమ్ కిరాయికి తీసుకొని అక్కడే తనను ఉంచి సదరు మహిళా బలవంతంగా శారీరకంగా కలవమని ఇబ్బంది పెట్టగా కలుసుకునే వారిని అని తెలిపినాడు. బాలుని వెంట తీసుకొని వెళ్ళిన డబ్బులు ఖర్చయిన తర్వాత తీసుకొని వెళ్ళిన బంగారాన్ని చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మగా వచ్చిన డబ్బులు కూడా జల్సాలకు ఖర్చు అయినాయి పై నిందితురాలు మహిళను పట్టుకొని పోక్సో కేసులో అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App