TRINETHRAM NEWS

Strong arrangement at Group-1 examination centres

రామగుండం పోలీస్ కమీషనరేట్

గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

• బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు

పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రాన్రిక్ పరికరాలకు,  ఎలక్ట్రాన్రిక్ వాచ్లకు అనుమతి లేదు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 14 సెంటర్ల లో పరీక్ష రాయనున్న 6098 మంది అభ్యర్ధులు

మంచిర్యాల జిల్లా లో వ్యాప్తంగా 27 సెంటర్ల పరీక్ష రాయనున్న 9384 మంది అభ్యర్ధులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.జి.పి.యస్.సి.) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు పోలీసు శాఖ తరపున్న అన్నిరకాల భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఒక ప్రకటనలో తెలియజేశారు. రామగుండము పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా 41 సెంటర్లలో మొత్తం 15,482 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, పట్టణ ప్రధాన రోడ్డులు, చౌరాస్తాలలో సూచిన బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుదని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలో సభలు, ఊరేగింపులు, ర్యాలీలు లాంటివి నిర్వహించ కూడదని, అనవసరంగా గుంపులు గుంపులుగా ఎవ్వరూ కూడా పరీక్ష కేంద్రం పరిసరాలలో తిరగటానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాపు యజమానులకు సూచించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని, అభ్యర్ధులు బయోమెట్రిక్, వెరీఫికేషన్ సిబ్బందికి సహకరించవలసిందిగా రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) సూచించారు.

(అభ్యర్ధులకు సూచనలు)

పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోనికి అనుమతి ఇస్తారని, 10 గంటలకు పరీక్షా కేంద్రం గెట్ మూసివేయడం జరుగుతుందని, 10 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన ఎవ్వరిని లోపలికి అనుమతించడం జరగదు.

ఎగ్జామ్ కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ నందున్న నియమనిబంధనాలు తప్పకుండా పాటించాలన్నారు.

అభ్యర్ధులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ఉద్యోగి గుర్తింపు కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుందని అన్నారు.

హాల్ టికెట్ నందు ఫోటో సరిగ్గా కనిపించకపోయినట్లైతే 3-కలర్ ఫోటోలు తీసుకొని, హాల్ టికెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకొని రావలసి ఉంటుంది.

అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూకున్నట్లైతే, పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు.

ఎగ్జామ్ రాయడానికి (బబ్లింగ్) బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను మాత్రమే అనుమతిస్తారని అన్నారు.

ఎగ్జామ్స్ హాల్ లోనికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, హియరింగ్ సొల్యూషన్స్ సంబంధించిన గాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు.

ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఒంటిగంట వరకు ఎవ్వరిని బయటకు పంపడం జరగదని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నాపత్రం తమతో పాటు తీసుకువెళ్ళడానికి వీలుగా ఉంటుంది అన్నారు.

అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Strong arrangement at Group-1 examination centres