TRINETHRAM NEWS

Telangana State Public Service Commission should not play with the unemployed

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉవ్వెత్తున ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన విభాగం. కానీ అత్యంత కీలకమైన టీఎస్‌పీఎస్సీ పనితీరు గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా సంతృప్తికరంగా లేదని డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా కోరారు.
అనంతరం దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పిఎస్) నాయకులు మద్దెల దినేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అయితే పేరుకు నోటిఫికేషన్లు వచ్చిన వాటిని పకడ్బందీగా నిర్వహించకపోవడంతో కోర్టు కేసులు ఆప్రక్రియను జాప్యం చేస్తు పరీక్షలు నిర్వహించినా నిర్లక్ష్యం, పేపర్‌ లీకేజీలతో ప్యాకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆయన ఆరోపించారు

ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూసిన గ్రూప్‌ 1 పరీక్షల కోసం కష్టపడి చదివితే అది కాస్త కొంతమంది దుర్మార్గులు చేయబట్టి ప్రశ్నాపత్రాల లీకేజీతో పరీక్ష రాసిన లక్షలాది మంది జీవితాలు అంధకారంలోకి నెట్టివేసినట్టయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తరుణంలో నిరుద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం రాజీలేని పోరాటం చేస్తూ, ఈ పోటీ ప్ర‌పంచంలో నెగ్గేందుకు నిద్ర‌ల్లేని రాత్రులు గడుపుతూ పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డుతున్నారని, ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించిన త‌ర్వాతే త‌మ ఊర్లల్లో అడుగుపెట్టాల‌నే సంక‌ల్పంతో క‌సితీరా చ‌దువుతున్నారని, కానీ గత ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, నియామ‌క సంస్థ‌ల నిర్వాకం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు తీవ్రంగా న‌ష్ట‌పోయారని, నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అయిన గత ప్రభుత్వం పై మండి పడ్డారు.

ఇందుకు ఉదాహ‌ర‌ణ ఏ.ఈ, గ్రూప్-1 ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ అని వారు పేర్కొన్నారు.

జూన్ 9న జరిగే తెలంగాణా టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను యూనియన్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీకి)కు బాధ్యతలు అప్పగించాలని ఆయన ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు.

దాదాపు ఈ గ్రూప్ -1 పరీక్షను నిరుద్యోగులు రాయడం రద్దు అవడం అని విమర్శించారు. ఈ పరీక్ష రాయడం నిరుద్యోగులు మూడవ సారి అని పేర్కొన్నారు.
అసలు రాను రాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన నిరుద్యోగులకు పూర్తిగా నమ్మకం పోయిందని కావున యుపిఎస్సికి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State Public Service Commission should not play with the unemployed