WhatsApp Image 2024 06 06 at 16.23.37
Badibata program started in Mancharya
జూన్ 06, మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పట్టణంలోని ఏసీసీ- 3 అంగన్ వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఐదేళ్ళ లోపు పిల్లలను అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ ఎన్. పద్మ, సహాయకురాలు లత పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
