అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు

TRINETHRAM NEWS

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన వోల్వో బస్సు

అనంతపురం జిల్లా: డిసెంబర్23

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నే మండలం కల్లూరు దగ్గర బస్సు, ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన జరిగింది.

శనివారం తెల్లవారు జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన రైతులు..

చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30)గా గుర్తించారు.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ నరేష్ అనే వ్యక్తి‌ పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది

You cannot copy content of this page

Scroll to Top