Kavitha’s bail petition.. Twist again in the court
Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఈడీ అరెస్ట్ చేసిన విధానం..
కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సీబీఐ ని హైకోర్టు ఆదేశించింది.
సోమవారం నాడు రెండు కేసుల్లో కవిత తరఫున వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. మంగళవారం నాడు ఈడీ, సీబీఐ వాదనలు వింటామన్నారు న్యాయమూర్తి.
అనంతరం కవిత బెయిల్ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కాగా, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై శనివారం నాడు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App