జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 6.04.57 PM

TRINETHRAM NEWS

తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేస్తున్నాం.

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ…

ఆదోని/ డిసెంబర్ 22 :- తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేస్తున్నామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఆదోని నియేజక వర్గ ఎన్నికల అధికారి మరియు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు..

శుక్రవారం మధ్యాహ్నం సబ్ కలెక్టరేట్ సమవేశ మందిరం నందు సబ్ కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…. డిసెంబర్ 9వ తేదీ వరకు ఫారం 6,7,8 సంబంధించిన దరఖాస్తు చేసుకున్న ఫారాలను డిసెంబర్ లోపు పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేస్తామన్నారు. ఆదోని నియోజకవర్గం లో 256 పోలి కేంద్రాలు ఉండగా వాటిలో 24 కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా లేనందువలన బదిలీ చేయడం జరిగిందన్నారు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆదోని ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు.

ఈ సమావేశానికి తాసిల్దార్ వెంకటలక్ష్మి, ఉప తాసిల్దార్ రజినీకాంత్ రెడ్డి, ఉప తాసిల్దారు (ఎలక్షన్) ఇజాజ్ అహ్మద్, డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప, ఎంపీడీవో కార్యాలయపు పరిపాలన అధికారి విజయ శేఖర రావు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page