ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 05 12 at 18.07.50

TRINETHRAM NEWS

Trinethram News : జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి *

గుంటూరు,12 మే, 2024:-చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపి ఉన్నారని పేర్కొన్నారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలుపుతూ ప్రజలు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు

ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, గుంటూరు వారిచే జారి

You cannot copy content of this page