Trinethram News : చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు.
చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు.
ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తరహా ప్రచారం సరికాదన్నారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు.
ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమే అని తేల్చిచెప్పారు.
ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.