TRINETHRAM NEWS

ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూలైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు. భక్తులకు అడిగినన్ని లడ్లు ఇచ్చేలా ఏర్పాటులు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, చలవ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం మహా క్షేత్రం ముస్తాబయింది. తమ ఆడపడుచు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సారే సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలంలో ఐదు రోజులపాటు భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది మహోత్సవాలకు సుమారు పది లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా భక్తులకు ఏర్పాటు చేశారు.

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో ఉగాది మహోత్సవాల శోభ సంతరించుకుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి 6 నుంచి 10 వ తేదీ వరకు ఉగాది మహాత్సవాలు వైభవంగా నిర్వహించేందు దేవస్థానం అధికారులు ఈఓ పెద్దిరాజు సిబ్బంది భక్తుల ఏర్పాట్ల పనులలో నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబయింది. ఆలయంలో నేటి ఉదయం యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈఓ పెద్దిరాజు శ్రీకారం చుట్టనున్నారు. మొదటిరోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో‌ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రకి బృంగివాహనంపై స్వామిఅమ్మవార్లు శ్రీశైలం పురవీధులలో విహారించన్నారు.

మహాక్షేత్రంలో 5 రోజులపాటు జరుగనున్న ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ భక్తులు తండోపతండాలుగా భక్తిశ్రద్ధలతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీగిరి మల్లయ్య ఆదుకో మమ్మాదుకో అంటూ నల్లమల కొండలు దాటుతూ కోరిన కోరికలు తీర్చాలంటూ ఆర్తీతో భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా అకలి దప్పికలు మరచి భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవకులు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడా మంచినీళ్లు అల్పాహారం భోజన వసతి భక్తులకు ఏర్పాటు చేశారు. అలసిన భక్తులకు అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి అధికారులు సేవకు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.