WhatsApp Image 2024 03 16 at 11.26.38 PM
Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: నందిగామ
అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ టాంకును తమ అక్రమరవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోలును తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు” చెక్” పెట్టిన నందిగామ పోలీసులు.ఇలా ఎన్నిమార్గాలలో ఎన్నిరకాలుగా పోలీసులను ఏమార్చుదామంటే వారి పప్పులను ఉడకనివ్వని పోలీసులను చూచి తలలు పట్టుకొంటున్న అక్రమార్కులు.
వారి వద్ద నుండి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొన్న పోలీసులు
ఎసిపి రవికిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీ మోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివారులో అదుపులో తీసుకున్నామని బైకులో ఆశ్చర్యంగా 150 తెలంగాణ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయని మద్యం బాటిల్ బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు చాకచక్యంగా మద్యం పట్టుకున్న సీఐ హనీష్ ను ఎస్సై పండు దొర పోలీస్ ఎస్సై దుర్గ మహేశ్వర రావు సిబ్బందిని పట్టుకున్న సిబ్బందిని అభినందించిన ఏసిపి
