దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించింది. రూ.15000 బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో న్యాయస్థానం దీన్ని మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. వాటిని ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలోనే గత నెల ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. అయితే, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. మార్చి 16వ తేదీన తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దానిలో భాగంగానే ఈ రోజు ఆయన న్యాయస్థానానికి వచ్చారు.
కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈడీ చేసిన రెండు ఫిర్యాదుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో సీఎం కోర్టు నుంచి వెళ్లిపోయారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు బెయిల్
Related Posts
Encounter : సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
TRINETHRAM NEWS సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ Trinethram News : చత్తీస్ ఘడ్ : నవంబర్ 22ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న…
PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
TRINETHRAM NEWS మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు…