అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం

TRINETHRAM NEWS

Chhattisgarh : అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం..

ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

అంబులెన్స్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయ్‌పూర్ పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. రాయ్‌పూర్‌లో అంబులెన్స్ లో నుండి 364 కిలోగ్రాముల నిషేధిత గంజాయి (సైకోట్రోపిక్ డ్రగ్స్) స్వాధీనం చేసుకున్నారు..

బుధవారం అర్ధరాత్రి పోలీసు బృందం అనుమానాస్పద స్థితిలో అంబులెన్స్‌ను అడ్డగించి తనిఖీ చేసినట్లు ఆజాద్ చౌక్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ గుర్జార్ తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top