TRINETHRAM NEWS

విద్యాదీవెన, సివిల్ ప్రోత్సాహం అందించిన గొప్ప వ్యక్తి జగన్ మెహన్ రెడ్డి :ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి

నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించిన జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి.

జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు ఈ రోజు వారి ఖాతాలలో జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని తెలిపిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్.

దేశం లో ఎక్కడ కూడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అని చెప్పిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమినరీ ఉత్తీర్ణత సాధిస్తే 1 లక్ష రూపాయిలుప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండటం గొప్ప వరం అని తెలిపిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్.

ప్రిలిమినరీ తో పాటు మెయిన్స్ కి ఉత్తీర్ణత సాధిస్తే 1.50 లక్షలు రూపాయిలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

ఈరోజు విదేశీ విద్యా దీవెన ద్వారా 390 విద్యార్థులకు 41.60 కోట్లు,జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం క్రింద ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయిన 95 మందికి, వీరిలో మెయిన్స్ కి ఉత్తీర్ణత సాధించిన 11 మందికి 1.05 కోట్లు రూపాయిలు మొత్తం 42.60 కోట్ల రూపాయిలు వారి ఖాతాలలో నేరుగా జమ చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

గడిచిన 10 నెలలో కేవలం “జగనన్న విదేశీ విద్యా దీవెన” క్రింద 408 విద్యార్థులకు 107 కోట్లు రూపాయిలు ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోని టాప్ 320 కి పైగా అత్యుత్తమ కళాశాలలో ప్రవేశం పొందినఎస్.సి,ఎస్.టి,బి.సి,మైనారిటీ విద్యార్థులకు 1.25 కోట్లు వరకు,ఇతర విద్యార్థులకు 1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్,విమాన ప్రయాణం,వీసా ఖర్చులతో సహా ఇవ్వడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి తెలియజేసారు అని చెప్పిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్.

ఇటువంటి ముఖ్యమంత్రి నే మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చేసుకోవాలి అని, అప్పుడే రాష్ట్రం బాగుంటుంది అని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆనం అరుణమ్మ,నెల్లూరు నగర మేయర్ పి.స్రవంతి ,నెల్లూరు జిల్లా కలెక్టర్ యం.హారి నారాయణన్,నెల్లూరు జిల్లా ఉన్నతధికారులు తదితరులు పాల్గొన్నారు.