WhatsApp Image 2024 03 10 at 16.33.00
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగింది
భవిష్యత్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి
ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ దిశానిర్ధేశం
మిగతా పెండింగ్ సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని హామీ
21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులతో వర్చ్‌వల్‌గా ముఖాముఖి
తమ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
