ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

TRINETHRAM NEWS

కాకినాడ జిల్లా జగ్గంపేట

ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు..

సీఎం జగన్ తరఫున ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తానన్నారు.

తాను ఎటువంటి పదవి కాంక్ష కోరుకోవడం లేదన్నారు.

కేవలం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మాత్రమే వెళుతున్నాను అన్నారు..

రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ల ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు..

You cannot copy content of this page

Scroll to Top