జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 08 at 15.12.53

TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 08
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జాము న 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసు కుంది.

ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకా ణం పూర్తిగా దగ్ధమయ్యా యి. వాచ్ షాప్‌, మరో రెండు దుకాణాలు పాక్షి కంగా దెబ్బతిన్నాయి. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమా నిస్తున్నారు.

పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసింది. సుమారు రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

సంఘటనా స్థలాన్ని సీఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పరిశీలిం చారు…

You cannot copy content of this page