జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 08 at 13.43.08

TRINETHRAM NEWS

Trinethram News : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదకాకాని మల్లేశ్వర స్వామిని, క్వారీలో బాలకొటేశ్వర స్వామి దేవాలయాలను డీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత పెదకాకాని దేవాలయంలోని మల్లికార్జున స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పిదప స్వామి ప్రసాదాలను పెమ్మసాని స్వయంగా భక్తులకు అందజేశారు. అనంతరం క్వారీలో కొలువైయున్న బాలకోటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించారు. అనంతరం నారాకోడూరు, సుద్దపల్లికి చెందిన పలు ప్రభలకు డా. పెమ్మసాని కొబ్బరికాయలు కొట్టారు. స్ధానిక టీడీపీ – జనాసేన నాయకులు పెమ్మసానిని కలిసి ప్రభల వివరాలను తెలియజేశారు.

You cannot copy content of this page