జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 28 at 12.16.51

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అన్ని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకాన్ని అందించడం ద్వారా చాలావరకు తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గిందన్నారు. అంతే కాకుండా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ కొరకు ఒక కార్యాలయాన్ని నిర్మించుకుంటామని, దానికోసం స్థలాన్ని కేటాయించాల్సిందిగా బాపట్ల శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారిని విన్నవించారు. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించి స్థలాన్ని కేటాయిస్తానన్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న స్టాఫ్, యాజమాన్యాలు వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కార్యదర్శి కరీం, పేరాల వెంకట సురేష్ పోలిరాజు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page