తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ మారనున్న రైల్వేస్టేషన్ల రూపరేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను నిర్మించనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తిచేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వేశాఖ మొత్తం రూ.2,245 కోట్ల నిధులను కేటాయించింది. 2023 ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర సహకరిస్తుండటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైల్వేల రూపురేఖలను సమూలంగా మార్చివేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్లు కేటాయించిన నిధులు ..జడ్చర్ల రూ.10.94 కోట్లు ..గద్వాల్ రూ.9.49 కోట్లు ..షాద్ నగర్ రూ.9.59 కోట్లు ..మేడ్చల్ రూ.8.37 కోట్లు ..మెదక్ రూ.15.31 కోట్లు ..ఉందా నగర్ రూ.12.37 కోట్లు బాసర రూ.11.33 కోట్లు ..యాకుత్ పుర రూ.8.53 కోట్లు ..మిర్యాలగూడ రూ.9.50 కోట్లు ..నల్గొండ రూ.9.50 కోట్లు ..వికారాబాద్ రూ.24.35 కోట్లు ..పెద్దపల్లి రూ.26.49 కోట్లు ..మంచిర్యాల రూ.26.49 కోట్లు ..వరంగల్ రూ.25.41 కోట్లు ..బేగంపేట రూ.22.57 కోట్లు
తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లు
Related Posts
నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
TRINETHRAM NEWS నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకు అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *హాస్టల్స్ టైమింగ్స్ కట్టుదిట్టంగా అనుసరించాలి *పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి *రెసిడెన్షియల్ హాస్టిల్స్ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్…
Revanth Reddy : ఘన విజయంతో ప్రియాంక పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు: రేవంత్ రెడ్డి
TRINETHRAM NEWS ఘన విజయంతో ప్రియాంక పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు: రేవంత్ రెడ్డి వయనాడ్ లో భారీ ఆధిక్యతలో ప్రియాంక ఆమెకు వయనాడ్ ప్రజలు రికార్డు విజయాన్ని అందిస్తారన్న రేవంత్ గత ఎన్నికల్లో రాహుల్ కు 3.64 లక్షల ఓట్ల మెజార్టీTrinethram News…