Trinethram News : మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయించింది.
ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి.
మహాలక్ష్మి పథకంలో అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది.
తాజా నిర్ణయానికి సంబంధించిన విధివిధానాల్ని పౌరసరఫరాల శాఖ రూపొందించింది..