జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 22 at 2.11.07 PM

TRINETHRAM NEWS

Trinethram News : సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్స్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రకుల్‌-భగ్నానీ జంట గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కన్నడ చిత్రం ‘గిల్లీ’తో తెరంగేట్రం చేసిన రకుల్‌ ఇటీవల హిందీ పరిశ్రమలో దశాబ్దకాలం పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్‌లో ఒకే ఏడాది ఐదు చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘ఎటాక్‌’, ‘రన్‌వే 34’, ‘కట్‌పుట్లీ’, ‘డాక్టర్‌ జీ’, ‘థాంక్‌ గాడ్‌’ చిత్రాలు 2022లో విడుదలయ్యాయి. దక్షిణాదిలోను తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకున్న రకుల్‌.. ‘ధృవ’, సరైనోడు’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘నాన్నకు ప్రేమతో’, మన్మథుడు-2’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

You cannot copy content of this page