TRINETHRAM NEWS

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది.

ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

నిన్న రాప్తాడులో సీఎం సభకు ఆయన రాలేదు. ఆలూరు ఇన్ఛార్జ్ వేరే వ్యక్తిని వైసీపీ నియమించింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.