రాజమహేంద్రవరం, తేదీ: 10.2.2024
పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికి
పరిష్కారిస్తాం
పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం
కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం
- కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత
ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది గుర్తింపు డేటా నమోదు, తుది ఓటరు జాబితా అనంతరం ఫారం 6, 7, 8 లయొక్క ప్రస్తుత పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారి, మరియు పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిక్ష నిర్వహించారు.
రెండవ శనివారం ఉదయం కలెక్టరేట్ నుంచి కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఇతర నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎలెక్టోరల్ అధికారులు, కలక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా కి చెందిన వివరాలు తెలియ చేస్తూ, ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ సమయంలో బి ఎల్ వో లకు శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. నియోజక వర్గ స్ధాయిలో విధులు నిర్వర్తించే అధికారులకి, సిబ్బందికి శిక్షణ కొసం మాస్టర్ ట్రైనర్ ల ద్వారా ఎన్నికల నిర్వహణ, సాంకేతిక పరమైన పరిజ్ఞానం పై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఆమేరకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎలెక్టోరల్ సిబ్బంది తదితరులు హజారైనట్లు తెలిపారు.
జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబందించి 395 కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. సర్వైవల్, ఎన్నికల ఖర్చులు, సేక్టరాల్ , తదితర ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు పలు దఫాలుగా అవగాహన , శిక్షణా కార్యక్రమాలను పూర్తీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల తేదీకి అనుగుణంగా చేపట్టవలసిన వివిధ బాధ్యతలు పై రూట్ మ్యాప్ సిద్దం చేసి ఆమేరకు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగిందనీ కలెక్టర్ తెలియ చేశారు.
తుది ఓటరు జాబితా ప్రకటించిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఓటరు జాబితాలో ఫారం 6 లు 1394 చేర్చినట్లు, ఫారం -7 లు 635 తొలగించినట్లు, ఫారం -8 లు చెంది మార్పులు చేర్పులు 864 జరిగినట్లు తెలియ చేశారు. పెండింగ్ లో ఫారం లకు సంబందించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలనీ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకు, ఎలెక్టోరల్ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ ఆర్వో లాగిన్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చెయ్యాల్సింది గా తెలియ చెయ్యడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పోలింగ్ సిబ్బంది డేటా ఎంట్రీ పనులు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15 పూర్తి చేయనున్నట్లు మాధవీలత తెలిపారు. మైక్రో పరిశీలకుల ను సోమవారం నుంచి గుర్తించడం జరుగుతోందన్నారు. అందరూ రిటర్నింగ్ అధికారులు విధులను రిపోర్ట్ చెయ్యడం జరిగిందని, మిగతా అధికారులు కూడా సోమవారం నాటికి రిపోర్ట్ చెయ్యడం జరుగుతుందనీ తెలియ చేశారు.
వివిధ నియోజక వర్గాల పరిధిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు అనువైన భవనాలు గుర్తించడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాలలో అవసరమైన భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఎన్నికల నిర్వహణ సంబందించి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాకు చెందిన గతంలో లక్షా డెబ్బై ఎనిమిది వేల ఎపిక్ కార్డులు ప్రింటింగ్ కొసం పంపడం జరిగింది, కొత్తగా 46,761 ఎపిక్ కార్డుల ప్రింటింగ్ కి డేటా పంపడం జరిగిందనీ, వీటి విషయంలో ప్రతీ రోజు ఎన్నికల కమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 80 ప్లస్, 40 శాతం పైబడిన ఆబ్సెంటీ ఓటర్లు గుర్తింపు జరుగు తోందన్నారు. అదేవిధంగా రిసెప్షన్ కేంద్రాలు ఏడు నియోజక వర్గాలలో పాటు అదనపు కేంద్రం కూడా గుర్తించినట్లు తెలిపారు.
ఈ సమావేశం లో రాజమండ్రీ రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజమండ్రీ అర్బన్ ఆర్వో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జి. నరసింహులు, రాజానగరం ఆర్వో ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, అనపర్తి ఆర్వో ఎమ్. మాధురి, గోపాలపురం – ఓఎన్జీసి ఎస్.డి.సి కె ఎల్ శివజ్యోతి, అనపర్తి – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఎమ్. మాధురి , నిడదవోలు – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు ఆర్ వి రమణా నాయక్ , పర్యాటక శాఖ ఆర్ డి వి. స్వామీ నాయుడు, ఎస్.డి.సి., ఎమ్. వెంకట సుధాకర్, ట్రైనీ డిప్యూటీ కలక్టర్లు పి. సువర్ణ, ఎమ్. భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.