కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు.

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు. వాడరేవులోని ఒక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదిలో కొద్దిసేపు తెలుగు పాఠం చెప్పారు. మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు..కష్టపడి చదవటమే ఇష్టంగా పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ బాషా ఉద్భోదించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడం పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top