WhatsApp Image 2024 02 08 at 18.25.32
మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు
మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కల్యాన్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు..
విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు.. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. పరిష్కరించుకొని ముందుకు వెళ్తాం అన్నారు. టీడీపీ-జనసే కూటమితో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కలిసి వస్తుందని భావిస్తున్నాం అన్నారు.. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను మా అధినేత ప్రకటిస్తారన్న ఆయన.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంది.. కాబట్టి, టీడీపీ నేత చింతకాయల విజయ్ తో మర్యాద పూర్వకంగానే కలిశాం అన్నారు. ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ అంశం చర్చకు రాలేదు అన్నారు. ఇక, నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్ని వెల్లడించారు
