TRINETHRAM NEWS

Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది.
అయితే, ఈ ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. ఇక, తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సాధారణ సెలవుగా మార్చి పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. దీంతో విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 8 అంటే రేపు షబ్-ఎ-మెరాజ్ (Shab e-Meraj) పండుగ. ఈ పండుగ రోజును ముస్లింలు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు మసీదులను దీపాలతో ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు.
ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత సాధారణ సెలవులు లేవు : హిందువులు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రంతా ఏ విధంగా అయితే జాగారం చేసి దేవుని ప్రార్థిస్తారో, అదే విధంగా ఫిబ్రవరి 8న ముస్లింలు కూడా రాత్రంతా జాగారం చేస్తారు. అంతేకాదు ఆ రాత్రంతా వారు ప్రార్థనలు చేస్తూ ఉండిపోతారు. ఇక, ఈ షబ్-ఎ-మెరాజ్ పండగ రోజున ఇస్రా, మేరాజ్ల కథను మసీదుల్లో ఉండే వారందరికీ వివరిస్తుంటారు. ముస్లింలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ రోజున తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు (ఫిబ్రవరి 8న) తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి. ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు అస్సలు లేవు. ఇక, వచ్చే నెల అంటే మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉన్నాయి. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది. మార్చి 25న హోలీ పండగ, మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు ఉండనున్నాయి.