నవంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Awareness program

మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అరకు ఐటీఐలో అవగాహన సదస్సు

Awareness Program : అరకులోయ,నవంబర్ 26,( త్రినేత్రం న్యూస్): మహిళలపై హింసను అరికట్టి, మద్యం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, యువత ఐక్యంగా కృషి చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం అరకు వ్యాలీ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మహిళా సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
కళాశాల లెక్చరర్ రంజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై. ఉమాశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వి.వి. జయ మాట్లాడుతూ మహిళలపై హింస, వివక్షకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలని, సామాజిక అన్యాయాలను ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నారు. పితృస్వామ్య భావజాలం, మహిళల పట్ల వివక్ష, ఆర్థిక స్వావలంబన లోపం హింసకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా అవగాహన, ప్రచార, పోరాట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సదస్సులో మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కిల్లో శశికళ, జిల్లా కమిటీ సభ్యురాలు జి. సన్యాసమ్మ, లెక్చరర్లు ఎస్.వి. రమణ, జి. చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page