
మరో విద్యార్థికి గాయాలు.. స్కూల్ యాజమాన్యంపై తండ్రి ఆరోపణలు
Tragedy : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్: స్కూల్ పిక్నిక్ సరదాగా సాగాల్సిన వేళ విషాదం చోటుచేసుకుంది. మోయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో జరిగిన ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి గాయపడ్డాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది పిల్లలు కూర్చోగా, మరో నలుగురు దాన్ని ఊపుతున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు అదుపుతప్పి కదులుతున్న ఊయలకు తగలడంతో తీవ్ర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిక్నిక్ సమయంలో సరైన భద్రతా చర్యలు, పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని మృతుడి తండ్రి స్కూల్ యాజమాన్యంపై ఆరోపణలు చేశారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంతో మృతికి కారణమైనట్లు, ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడినట్లు కేసులో పేర్కొన్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధ్యుల వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
పిల్లల ఆనందం కోసం ఏర్పాటు చేసిన పిక్నిక్‌లో చిన్నారి ప్రాణం పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe