నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Students Assault Lecturer

విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు..

Students Assault Lecturer : త్రినేత్రం న్యూస్ : సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పరిధి పటేల్‌గూడలో ఉన్న ఎల్లంకి పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంగ్లీష్ లెక్చరర్‌పై విద్యార్థులు దాడి చేసి చితకబాదారు.

కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి లెక్చరర్ రవి అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ప్రతిరోజూ తనతో చాటింగ్ చేయాలని వేధించినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వాట్సాప్ సందేశాల స్క్రీన్‌షాట్లు చూసి ఆగ్రహంతో లెక్చరర్‌పై దాడికి దిగారు. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లెక్చరర్ రవిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page