నవంబర్ 20, 2026
TRINETHRAM NEWS
Mock Elections

Mock Elections : డిండి (గుండ్లపల్లి ) నవంబర్ 20: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి . విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, గుండ్లపల్లిలో పాఠశాల స్థాయిలో హెడ్‌బాయ్ మరియు హెడ్‌గర్ల్ ఎంపిక కోసం మాక్ ఎన్నికలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్నికల విధానం, నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల గుర్తుల ప్రాముఖ్యత, ఓటు హక్కు, రహస్య ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై సమన్వయ కర్త సుశీల,ఎన్.ఎన్.విజయ్ కుమార్ సోషల్ డిపార్ట్ మెంట్ ఉపాధ్యాయులు రమేష్,శ్రీలత అవగాహన కల్పించారు.
హెడ్‌బాయ్ మరియు హెడ్‌గర్ల్ పదవుల కోసం పోటీ చేసే విద్యార్థులు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించి, తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులతో ప్రచారం నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఎన్నికల గుర్తులను ఉపయోగిస్తూ తమకు ఇష్టమైన అభ్యర్థులకు మద్దతు తెలిపారు. అభ్యర్థులు తోటి విద్యార్థులను కలిసి తమ లక్ష్యాలను, పాఠశాల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. మండల తహశీల్దార్ శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఉపాధ్యాయ బృందాన్ని , విద్యార్థులను అభినందించారు.
ఈ మాక్ ఎన్నికల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించే విధానాన్ని విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటుకు ఎంతో విలువ ఉంటుందని, ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు మరియు బాధ్యత అని తెలిపారు. నాయకత్వం అంటే కేవలం పదవిని పొందడం మాత్రమే కాదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, క్రమశిక్షణ పాటించడం, తోటి విద్యార్థులకు సహకరించడం, పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం అని వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, సమయపాలన, నిర్ణయాత్మక శక్తి, పరస్పర గౌరవం, బాధ్యతాయుతమైన పౌరసత్వం వంటి విలువలు అలవడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికితీసి, భవిష్యత్తులో సమాజానికి మంచి నాయకులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. హెడ్ బాయ్ గా నవీన్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, హెడ్ గర్ల్ గా గిరమోని లిహారిక, 10వ తరగతి విద్యార్థులు గెలుపొందారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యాంసుందర్,శ్రీలత,రమా, కోదండరామ రావు, వేంకటేశ్వర్లు,సోమయ్య, చెన్నయ్య,రవి, విజయ్ కుమార్, బాలకృష్ణ, శ్రీను, అశ్విని,రుంషా, శ్రీనివాస్, జ్యోతి, సందీప్, ధనలక్ష్మి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page