నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Ensure victory

Ensure Victory : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; జీలుగుమిల్లి మండలంలోని పాలచర్ల, చంద్రమ్మకాలనీ, సిర్రివారిగూడెం, బర్రింకాలపాడు, తాటియకులగూడెం గ్రామాల్లో పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు భారీ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గ్రామాల్లోని ప్రతి వీధిలో పర్యటించారు. ప్రజలను కలుసుకుని ఎన్నికల గురించి వివరించారు.
ఈ సందర్భంగా కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు కారం సుజాత, జాస్తి హేమతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి కుంజా నాగమణిని అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని ఆయన మాట్లాడుతూ ప్రజలను కోరారు. గ్రామాల్లో నిర్వహించిన ర్యాలీలు, రోడ్‌షోలకు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము,ఆ నియోజకవర్గం సీనియర్ నాయకులు నేలటూరి మోహన్, సుంకవల్లి సాయి, కూటమి నాయకులు గూడపాటి పుల్లయ్య, దొంగ మురళి, వెలగల అజయ్, ఉండవల్లి రామకృష్ణ, ఉప్పులూరి శ్రీనివాసరావు, జాస్తి సత్యనారాయణ, ఆచంట విష్ణుమూర్తి, కర్రి మహేష్, సూరిశెట్టి మహేష్, కొమ్ము రాజకుమార్, సూరిశెట్టి శ్రీను, మానుకుండా రాజకుమార్, వీరయ్య, గారపాటి శ్రీను, బొల్లగాని అఖిల్, గద్దే సుబ్రహ్మణ్యం, ఉండవల్లి కిరణ్, ఈటా దేవీంద్ర, కోడెల్లి చిన్ని, రాయి సుబ్బారావు, గంధం వెంకటేశ్వరరావు, వనమా రాంబాబు, గంధం పద్మారావు, చిర్రి వెంకటేశ్వరరావు, చిర్రి నాగరాజు, చిర్రి అశోక్, ప్రేమ్, నారాగాని నరేంద్ర, చామన శేఖర్, యలమర్తి జాన్, కూరం వెంకటేశ్వరరావు, చిర్రి శ్రీను, కోలా మధు, మొడియం వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page